మీరెప్పుడైనా అటువంటి హృదయాన్ని చూసారా?


నాకో తోడు కావాలి
ఆ తోడు నా నీడై
రావాలి నన్ను వెన్నంటి
సముద్రపు సునామిలోనికి
వెండి పాయలు నన్ను ముగ్గుబుట్టని చేస్తుంటే
ప్రేమెందుకని అంటున్నారా 
వానపాముకి మట్టిమీద ఎందుకు ప్రేమో
అడిగారా మీరెవరైనా
జాబిల్లి వయస్సెంతో కనుక్కోగలరా మీరెవరైనా
కూకూ పిట్టలు కులుకుతూ ఎగురుతుంటే
కళ్ళప్పగించిచూస్తున్నారే
నాకోతోడు చూడాలని అనిపించలేదా
పండుటాకులా నే నేల రాలిపోకముందే
నన్ను ప్రేమించే ఓ హృదయం కావాలి నాకు
మీరెప్పుడైనా అటువంటి హృదయాన్ని చూసారా?

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ