సంధ్య పొద్దుకాడ


తొలి సంద్య
ఆ అద్బుతాన్ని ఎప్పుడైనా చూసారా
వళ్ళు విరుచుకొంటూ
సూరిని తొలి పాదపుటడుగులు
తూర్పు దిక్కున పడుతుంటే 
వెచ్చని అతని వెలుగులు
పిల్లతెమ్మరలు తాకిన వసుఃసుందరి
వయస్సుని మెరిపిస్తూ ఒల్లంతా పసిడిని నింపి
కన్నెపిల్ల బుగ్గలలొని పసుపుదనాన్ని
తన అధరాల ఎర్రదనాన్ని శయన మందిరంగా చేసుకొని
తన గుండెల లోలోనికి ఒరుసుకోనిపోతూ
ప్రతి సంద్యోదయము  మొదటి రాత్రికి నవోదయంగా 
కాటుకకళ్ళలోని కాళరాత్రిని తరుముతూ వెలుగు చీకటిలు
తమకంగా వాటేసుకొని ఒకరు తూర్పున
పడమట అలిగిన రాత్రిని చెట్టాపట్టాలేసుకొని
జాబిల్లి తన చల్లదనాన్ని పానం చేస్తూ
జొడుగుర్రలపై స్వారీచేస్తూ వస్తున్న
ఆ వెలుగుల రేడుకి తనని అందుకోమని
బుగ్గన సొట్టపెట్టుకొని
కైపెక్కిన కళ్ళతో ఆహ్వానం చెబుతూ
సంద్య
వాకిటిన ఆ కిరీటిని నిలిపి 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ