రాధా - గొపాళం



రాధ: ఏవండి హానిమూన్ కి ఊటి వెల్దామండి.
కవి: నీవు నా కెదురుగా ఉంటే చందమామనే నీ దోసిట్లో నే పెట్టనా?

రాధ: పూజకు పూలు తీసుకురండి.
కవి: నీ కన్నులే కలువలు అయితే మరి పూజకు పూలు ఎందుకు? 
 
రాధ: భొజనానికి రండి.
కవి:  నీవు నాకు ఎదురుగా ఉంటే ఆకలి దప్పికలు తెలియవులే? 

రాధ: వంటకు కూరగాయలు తీసుకురండి.  
కవి: నీ దొండపండులాంటి పెదవులుండగా మరి కాయలెందుకు.  

రాధ:  అద్దము పగిలింది. క్రొత్తది తీసుకురండి.
కవి:  చందమామలాంటి నీ మోము ఉండగా అద్దమెందుకు?   
 
రాధ: పండుగకు కంచి పట్టుచీర కొనివ్వండి.    
కవి: నీ పరువాల విరుపులుండగా మరి పట్టుచీర ఎందుకు?

రాధ:సినిమాకు వెళ్దామండి.    
కవి: రంగుల ప్రపంచం నాకెదురుగా ఉంటే మరి సినిమాలెందుకు?

రాధ: నాకు విడాకులు కావాలండి. అమెరికా తీసుకెల్తాడని
        పెళ్ళి చేసుకుంటే  అమలాపురం కూడా   తీసుకెల్లలేదు.
       నా జీవితం అంతా నాటకం గా మారింది.

న్యాయమూర్థి : ఏమండి కవిగారు మీరెమంటారు. 
కవి: నా హృదయేశ్వరి కోరినది పారిజాతమైన దివినుండి భువికి నే తేనా?     

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ