నీవు నిస్సబ్దానికే నీడవు


నీవు నిస్సబ్దానికే నీడవు
 నీ కళ్ళల్లోని ప్రేమ
కొలిమిలో కాలుతున్న 
ఇనుప కడ్డిలా 
కరిగి ప్రవహించి 
ఎర్రని జీరగా మిగిలింది
అందులో మిగిల్చింది 
నను సన్నని బూడిదగా 
ఆకసాన్నంత అలుముకొన్న 
నేను నీ వేడికి 
కరిగి కరిగి వర్షంలా
కురిసి హిమలయంలా 
చల్లదనానికి గడ్డకట్టి 
నీపై  కోరికతో 
సాగి ప్రవహించి 
నీ కంటినే అందుకొన్న
 కంటిలోని బిందువై 
కనురెప్పల మాటున 
నీలో నేనైనా నాకు విశ్రాంతి
నా కోసం నీవు కనులు 
తెరచినపుడు జారివస్తాను 
ఒక స్వప్నమై
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ