ప్రియాత్మ
నన్ను చూడని నీ కళ్ళని
నా అరచేతులతో మూయాలని
నాతొ మాట్లాడని నీ నోటిని
నా పెదవులతో మూయాలని
నాలో ఏదో తీరని కోరిక
కన్నులలో నిన్నే చూసినపుడు
నా ప్రతిబింబాన్ని నే చూసాను
మాట్లాడని నీ పెదవులలో
మమతనే నే చూసాను
ఒడిలోని పాపతో ఎన్నెన్నో ఊసులు
నిన్నే చూసాను నా పాపగా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి