అమ్మ ప్రేమ
మమత అన్నది ఎంత తీయనైనది
మనము కోరుకోనిది మరింత మధురమైనది
ఊహలలోనైన తలవనిది
తలపులలోనైన కానరాని
మధురమైన తీయదనం
ఊహలను మల్లె పందిరి క్రింద పరచిన
వెన్నెలలోని చల్లదనం
నా హృదయాన్ని
కమ్ముకున్న మంచు తెరనే తొలగించినట్లు
తెరలు తెరలుగా వచ్చిన నీ ఆ నవ్వు
ఆ కన్నులలోని వెలుగులు కాంతి చిమ్మగా
ఆ ఒక్క కన్నీటి బొట్టు చాలు
నీవెంత
మదురమైన దానివో తెలపడానికి
అమ్మ నీ ప్రేమ వెలకట్టలేనిది
అది శిధిలంకాక వెలుగొందాలి జన్మ జన్మలకు
............మా అమ్మకి ప్రేమతో...........
............మా అమ్మకి ప్రేమతో...........
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి