ప్రేమపాశం
https://www.neccheli.com/2022/12/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b0%aa%e0%b0%be%e0%b0%b6%e0%b0%82-%e0%b0%95%e0%b0%a5/ మా పుట్టింట్లో పెద్ద మునగచెట్టు ఉండేది. చెట్టు నిండుగా చివుర్లు, పూతలతో కళకళలాడుతుండేది. ఇంట్లో అంత ఎసరు పెట్టుకుంటే చాలు, కూరకు కమ్మని మునగ పప్పు, మునగ చారు తయారుగా ఉండేవి. మేమందరము పనికి పోయి కష్టపడి ఇంటికి రాగానే మా అమ్మ పెట్టిన వేడివేడి రాగిసంగటి, ఎండుచేపలు వేసిన మునక్కాయ పులుసును లొట్టలు వేసుకొంటూ తినేవాళ్ళం. నాకు పెండ్లయినాక ఎప్పుడైనా పుట్టింటికి పోయినప్పుడు తప్పనిసరిగా ఆ లేత చిగురులను తాలింపు పెట్టించేదాన్ని. కమ్మని ఆ రుచి నాకు ఇంకెక్కడా తగలలేదు. మేము టౌన్లొ చిన్న ఇల్లు కట్టగానే నేను ఆ మునగ కొమ్మను తెచ్చి మా పెరట్లొ పాతాను. అప్పటికి నాకొడుకు ఇంకా చేతికి అందిరాలేదు. టౌన్లో ఏది కొనాలన్నా కష్టమే. నాలుగు కడుపులు నింపడానికి నేను, నా మొగుడు చానా అవస్థలు పడ్డాము. మా ముసలాడు చూస్తే నాలుగు పదులు రాకనే అదేదో మాయజారి జబ్బుతో శక్తిలేనివాడై పనికిపోక ఇంట్లో కూర్చోని తినబెట్టినాడు. నాలుగ...