బతుకు భయం భయంగా
https://www.gotelugu.com/telugustories/view/10800/batuku-bhayam-bhayamgaa నా కళ్ళల్లో నెత్తురు కారుతోంది కన్నీళ్ళకు బదులుగా. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా ! వద్దా ! వెళ్లితే ఏమౌతుంది! కొడ్తారేమో ! తన జీవితం నాశనం అవుతుంది !!! ఒక జీవితాన్ని నాశనం చేయవచ్చా?...వెళ్లకపోతే ఇంక ఎక్కడికి వెళ్లాలి ! నా వేదనని ఎవరికి చెప్పుకోవాలి? స్పర్శ సుఖాన్ని ఇస్తుందా?లేక దహిస్తుందా? గుండె కాలడమే నాకు తెలుసు! ఆ మంటలో నేను కాలిపోతూ ఉంటే...వాడికి అది సుఖమా? స్పర్శ సుఖాన్ని పొందే మానవ మృగాలు!!! చర్మం కాలుతున్న వాసన వారికి రాదా? వేలకొద్దీ ముల్లులు ఏకకాలంలో వళ్లంతా దిగబడినట్లు ఉంది !!! గునపంతో ఎక్కడో గట్టిగా పొడిచినట్లు ఉంది !! కన్నీళ్లు కారిపోతున్నాయి తెలియకుండానే నా హృదయము లోని బాధకు!!! అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయం...ఎక్కడ ఎవరు ముట్టుకుంటారో! తాకుతారోనాని! భారతదేశ చట్టాల ప్రకారం, ఒక అమ్మాయి అంగీకారం లేకుండా ఆమెని తాకి భయాన్ని కలిగించినప్పుడు IPC సెక్షన్ 354 A ప్రకారం రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు వరకు జైలు శిక్ష ను పొందుతాడు. అలా అని తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో....