ఒక చిన్నారి ఆశయం
మనచుట్టు ఎంతోమంది ఎన్నెన్నో ఆశయాలు కలిగి ఉంటారు. కొంతమంది ధనాన్ని సంపాదించాలని, కొంతమంది సమాజంలొ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, రాజకీయ నాయకులు కావాలని, గొప్ప నాయకుడిగా ఎదగాలని, ఇంకొంతమంది శాస్త్రవేత్తలుగా ప్రఖ్యాతి సంపాదించాలని, నటులుగా, నాట్యకారులుగా, కళాకారులుగా, ఫాషన్ డిసైనర్లుగా, ఇంజినీర్లుగా ఎన్నెనో ఆశయాలు. మరికొంతమంతి సాహసికులుగా పర్వతాలను అధిరోహించడం, సముద్ర ప్రయాణాలు చేయడం, క్రీడలలొ రాణించడాన్ని మనము చూస్తూనే ఉన్నాం. ప్రతి మనిషికి జీవితాన ఒక ఆశయం ఉండాలి. నా ఆశయం డాక్టర్ కావడం. నా చుట్టూ ఉన్న వ్యక్తులకు సహయం చేయడం. వైద్యురాలిగా నా ప్రాంత ప్రజలకు, అసహాయకులకు సేవ చేసి నా వృత్తి ద్వారా గౌరవ ప్రఖ్యాతులు సంపాదించి నా కుటుంబానికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెంపొందించడం నా ఆశయం. అనారోగ్యంతో ఉన్నవారికి సేవచేయడంలోనే సంతోషం ఉందని నేను నమ్ముతాను. వారి శారీరక బాధలను నా వైద్యంతో నయం చేసి నేను ఆత్మసంతృప్తి పొందుతాను. ఇనుమును కరిగించడానికి వేడి చేసినట్లు నేను నా మాటలతో వారికి స్వాంతన కలిగిస్తూ వారి శారీరక మానసిక అనారోగ్యాలను నా మం...