వలపు తాడో పలుపు తాడో తెలియక
https://www.koumudi.net/Monthly/2022/october/index.html నన్ను నేను తప్పించుకొని తిరుగుతున్నాను ఎండనక వాననక పగలనక రేయనక కంటిచూపు మేరలో కానరాలా ఎవ్వరూ అయినా ఎందుకో భయం గుప్పెట్లో చిన్న చిరు చప్పుడుకే తత్తర బిత్తర పడి కాళ్ళ గజ్జలు ఎక్కడ చప్పుడు చేస్తాయోనని అడుగు తీసి అడుగు వేస్తూ అర మైలు దూరం నడిచినంతలోనే అలుపు తీర్చుకొంటూ వగరొస్తూ సెగలు పొస్తూ భయం గుప్పెట్లో నేను కానరాని కారడివా అంటే కానే కాదు ఘాండ్రించే పులులు పాకే పురుగులు తిరిగే నడవా కాదు నరబలులు కోరే నేర ప్రపంచం రక్తాన్ని పీల్చే నరలోకం ఎవ్వరు మన పురుషులో ఎవ్వరు పరపురుషులో తెలియని మాయ లోకం వలపు తాడో పలుపు తాడో తెలియక అమాయకపు బిత్తర చూపులతో చిత్తడి నేలపై వెనుదిరిగి చూస్తూ ముందడుగు వేసి వేయలేక పక్కల చూస్తూ రాబందువుల భయంతో నేను !!!!