పోస్ట్‌లు

మే, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆరాధన

    చిన్న చిరు సవ్వడి నడిరేయినా మనస్సు ఉలిక్కిపాటును అణచుకోలేక తత్తరపడి తొందరపెట్టి తలదిండుగా పెట్టుకొన్న అరచేయిని గుండెలపైన ఉన్న చేయితో కలపి కన్నుల మబ్బుల తెరలను తొలగిస్తూ కిటికీ తెరచాటున నిలబడి నా నీడని చూసి నేనే ఉలిక్కిపడి నన్ను తలచిన వారిని తలస్తూ ఎవ్వరో ఎప్పుడో నాకు పంపిన మేఘసందేశాన్ని తీరికచేసుకొని ఈవేళ మేఘుడు నాకు వినిపిస్తుంటే ఆరాధన లోని అమృతాన్ని ఆస్వాదిస్తూ కన్నా వినిపిస్తుందా నా ఈ ఆలాపన ..........          

మాలపిల్ల

తోమాల నే కానా ఆ శ్రీనివాసుని హృదయానా   పూమాల నే కానా చిన్నికృష్ణుని కంఠాన మాల మాల అంటూ మాలోని మమతలను చూడరేమి తెలుగునేల మీద నడయాడే చంపకమాల  నే కానా ! సరిగమల సవ్వడి లోని గీతమాలని నే కానా !! తెలుగుపిల్ల కొప్పులోని  మల్లెమాల నే కానా !!!  మాలపిల్ల నంటూ వేలెత్తి చూపుతారేమి నా మేని  సొగస్సులు   వజ్రాల మాల మెరుపులు నాలో నిధి   తులశిమాల పవిత్రతా   నా అంతరాన   స్పటిక మాల చల్లదనం   పిల్ల గాలి లోని తెమ్మెరను నేనే.... పూలల్లోని తేనెలూరే మాథుర్యాన్ని నేనే ....... మీ హృదయాన్ని ఏలే దాసాదిదాసిని నేనే .............    అమ్మ పాలు చీకే బోసినవ్వుల పసిపాప    పెదవుల కొసన నిలచిన చివ్వరి అమృతపు బొట్టుని నేనే ...........