ప్రయాణం లో ఒక రోజు
https://sanchika.com/prayaanamlo-oka-roju-dr-bh-story/feb 19/2023 రాయచోటి..రాత్రి 7.30 ...కడపకు చివరి బస్...జనాలు ఎక్కుతున్నారు తోసుకుంటూ.... కొంతమంది ఇది చివరి బస్సు అంటూ ఉరుక్కుంటూ బస్ వైపు వస్తున్నారు. నేను కిటికిలో నుండి బ్యాగ్ సీటు పైకి అలాగ్గా విసిరి వేసాను.... అమ్మయ్య ఇక నా సీట్ కి డోకా లేదు అనుకుంటూ సిగరెట్ తీసి వెలిగించి... సిగరెట్ పొగ రింగులు రింగులుగా గాలిలోకి వదులుతూ అటు ఇటు చూస్తున్నా. "ఏమబ్బా యీ బస్సు యాడి వరకు పోతాంది" అన్న మాట నా పక్క నుంచి వినిపించి అటు చూసా. అరవై ఏండ్ల పెద్దామె నోట్లో పొగాకు నములుతూ నా వైపు చూస్తోంది. "పెద్దమ్మా ఈ బస్సు కడప పోతాంది అన్నాను" నేను. "నీదే ఊరబ్బా" అనింది మళ్లీ. "పెద్దమ్మ మాది చిన్నగొట్టిగల్లు. పని మీద పులివెందుల పోతాండా" అన్నా నేను. "వక్కాకుకు పది రూపాయలు లెక్క ఉంటే ఈ నాయనా" అంది ముసలమ్మ ... "ఇగో పెద్దమ్మ తీసుకో" ..పది రూపాయలు యాడనో పోతాంటాయి .....అదేమన్నా భాగ్యమాా ! అంటూ పది రూపాయలు ఇఛ్చినాను ... "నీ అమ్మ కడుపు చల్లగుండా" అని ఆయమ్మ అంటున్నంతలో... అటు బస్సు వ...