పోస్ట్‌లు

జనవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

మోహపు వల

 (https://www.gotelugu.com/telugustories/view/10924/mohapu-vala)  సెయ్ వసంత... ఇట్న రా బయటకి అంటూ వంటగదిలోకి దడ దడ మంటూ అరుస్తూ నవనీత వచ్చి రాగానే చెయ్యి పట్టుకుని బయటకు లాక్కోని వచ్చింది నన్ను. ఏమే తొందర నీకు...అంటూ బయటకు రాగానే  నా కళ్ళల్లోకి నవనీత చూస్తూ మోచేతితో పొడిచింది ఇంటి బయట తిన్నె పైన చూడమంటూ. అటు చూద్దును కదా...అక్కడ ఎవరో ఒక బక్కచిక్కిన ఆమె నిండా ముసుగు వేసుకుని కూర్చుని ఉంది మొహమైన కనిపించకుండా... ఎవ్వరా అంటూ నవనీత వైపు చూస్తే, కళ్లతో సైగ చేసింది దగ్గరకు వెళ్లి చూడమంటూ, దగ్గరకు నేను పోయి పోగానే, ఆ మనిషి నా కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది వసంతా అంటూ.. గబాల్న ముసుగు లాగి చూసా. గౌరీ హా గౌరీ ! అంటూ...ఏమ్మేయ్ ఇన్ని రోజులు ఎట్న పోయినావు మే...అని నవనీత వైపు చూసి ఇదెందే ఇట్లాగా అయిపోయిందే... అని నేను ఏడవడం ఎత్తుకున్న. నవనీతం నా దగ్గరగా వచ్చి ముందు లోపలికి పోండెహే బగిస పోతోంది యీదిలో... అని నన్ను పక్కకి లాగి  దాన్ని పైకి లేపింది.  అది బరువు తూకం కాలేక చేతులు నేలకు మోపి లెయ్యలేక లేసిన్ది. చూస్తుంటే గర్భం తో ఉన్న...