సూరీడు నువ్వు వస్తావోమోనని
నువ్వు వస్తవేమోనని మొహంతో ఎదురు చూసి నువ్వు రాక గడప మెట్లు ఎక్కక నేను సూరీడు కూడా నా ఎదురు చూపులను చూసి ఇక రాననుకొన్నాడో ఏమో కాని చీకట్లో దుప్పటి ముసుగేసి తోంగొంటూ చంద్రునీ వైపు చూసి చిలిపి నవ్వోటి నవ్వి కన్ను గీటి నా కాటుక కళ్ళని చూడమంటూ నిద్రలోకి జారుకొంటూ తన దుప్పటిని మరింత పట్టుగా బిగించి ఊరినంతా నిద్దట్లోకి చుట్టి చీకటి తావున దాకొన్నాడు ఒంటరి నక్షత్రామొకటి ఆకాసానికే దిష్టిచుక్కలా నిల్చోని నే చూస్తున్నా నేడైనా అది నింగినుండి దిగునని...........